IPL Media Rights:EPL ను వెనక్కునెట్టి రికార్డు సృష్టించిన IPL *Cricket | Telugu Oneindia

2022-06-15 122

IPL Media Rights:With $13 million per match, IPL Second most valued sporting league in the world | మీడియా హక్కుల పరంగా మరో రికార్డును బద్దలు కొట్టింది ఐపీఎల్‌. విశ్వవ్యాప్తంగా అత్యధిక ప్రజాధరణ కలిగిన ప్రముఖ ఫుట్‌బాల్‌ లీగ్‌ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)ను వెనక్కునెట్టిన ఐపీఎల్‌ విలువ పరంగా ప్రపంచంలో టాప్-2 లీగ్‌గా నిలిచింది. ఈపీఎల్‌లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 85 కోట్లు (11 యూఎస్ మిలియన్ డాలర్లు) కాగా, ఐపీఎల్‌లో అది రూ. 107.5 కోట్లకు (13.4 యూఎస్ మిలియన్ డాలర్లు) చేరుకుంది. గతంలో ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 54 కోట్లుగా ఉండేది. తాజాగా జరిగిన మీడియా హక్కుల వేలం ద్వారా ఐపీఎల్‌ విలువ ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది.


#IPLMediaRights
#NFL
#Secondmostvaluedsportingleague